వైసీపీ అధికార దుర్వినియోగాన్ని ప్రజలు గమనిస్తున్నారు: నాదెండ్ల మనోహర్
- త్వరలోనే బుద్ధి చెబుతారంటూ వ్యాఖ్యలు
- అరాచక పాలన సాగుతోందంటూ నాదెండ్ల విమర్శలు
- జనసేన, బీజేపీ కలిసి పోరాడతాయని వెల్లడి
రాష్ట్రంలో ఆలయాలపై వరుస దాడులు జరుగుతున్నాయని, ప్రశ్నించేవారిని అణచివేస్తున్నారని, నిరసన తెలిపితే నిర్బంధం విధిస్తున్నారంటూ జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ఇలాంటి చర్యలు రాష్ట్రంలో అరాచక పాలనకు నిదర్శనాలు అని పేర్కొన్నారు. వైసీపీ అధికార దుర్వినియోగాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఈ అరాచక పాలనకు చరమగీతం పాడేందుకు జనసేన పార్టీ బీజేపీతో కలిసి సంయుక్త కార్యాచరణకు సన్నద్ధమవుతోందని వెల్లడించారు.
రాష్ట్రంలో వైసీపీ పాలన భయాందోళనలకు గురిచేసే విధంగా ఉందని, ఇప్పుడిప్పుడే వైసీపీ పట్ల ప్రజల ఆలోచనా విధానంలో మార్పు వస్తోందని, త్వరలోనే ఆ పార్టీకి ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారని అన్నారు. చెన్నై ఐటీ బృందంతో వెబినార్ సందర్భంగా నాదెండ్ల మనోహర్ ఈ వ్యాఖ్యలు చేశారు.