స్టేడియంలోకి మీడియాకు అనుమతి లేదు: బీసీసీఐ
- కరోనా నేపథ్యంలో మీడియాకు అనుమతి నిరాకరణ
- మ్యాచ్ ల తర్వాత వర్చువల్ మీడియా సమావేశాలు
- ప్రెస్ నోట్స్ ద్వారా అప్ డేట్స్
కాసేపట్లో ఐపీఎల్ ప్రారంభం కాబోతోంది. అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య తొలి మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. స్టేడియంలలోకి మీడియాకు అనుమతి లేదని ప్రకటించింది. నెట్ ప్రాక్టీస్ సమయంలో ఆటగాళ్లను కవర్ చేయడానికి, ప్రెస్ మీట్లకు మీడియాకు అనుమతి ఉంటుందనే విషయం తెలిసిందే. అయితే, కరోనా వల్ల భౌతికదూరం పాటించాల్సి రావడంతో... మీడియాను అనుమతించడం లేదని బీసీసీఐ చెప్పింది.
మ్యాచ్ లకు ముందు ఫ్రాంచైజీలు ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టాల్సిన అవసరం లేదని... మ్యాచ్ లు ముగిసిన తర్వాత వర్చువల్ మీడియా సమావేశాలు ఉంటాయని బీసీసీఐ తెలిపింది. అప్ డేట్స్ ను ప్రెస్ నోట్స్ ద్వారా కూడా అందిస్తామని చెప్పింది.