ఫిట్ నెస్ లో ఇతడే నాకు పోటీ: సోనూ సూద్

  • లాక్ డౌన్ నేపథ్యంలో విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్న సోనూ సూద్
  • తాజాగా సోషల్ మీడియాలో తనయుడిపై పోస్టు
  • కుమారుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సోనూ
గతంలో ఒకట్రెండు చిత్రపరిశ్రమలకు మాత్రమే తెలిసిన సోనూ సూద్ కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పాప్యులారిటీ సంపాదించుకున్నాడు. అందుకు కారణం ఆయన దాతృత్వమే. లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా చిక్కుకుపోయిన వలస కార్మికులను వారి స్వస్థలాలకు చేర్చేందుకు సోనూ సూద్ చేసిన కృషి సామాన్యమైంది కాదు. బస్సుల నుంచి విమానాల వరకు ఖర్చుకు వెరవకుండా ఏర్పాటు చేసి వలస కార్మికుల ముఖాల్లో వెలుగు నింపాడు. అప్పటినుంచి సోనూ సూద్ పేరు మార్మోగిపోతోంది. సోషల్ మీడియాలో అయితే చెప్పనక్కర్లేదు.

తాజాగా ఈ బాలీవుడ్ నటుడు ఇన్ స్టాగ్రామ్ లో చేసిన పోస్టు విపరీతంగా సందడి చేస్తోంది. ఫిట్ నెస్ లో తనకు పోటీదారుడు దొరికాడంటూ తన కుమారుడు ఎషాన్ ఫొటో పోస్టు చేశారు. బాల్యంలో ఇషాన్ తనతో కలిసి ఉన్నప్పటి ఫొటో పంచుకున్నారు. ఎషాన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సోనూ... ఇన్నాళ్లకు ఫిట్ నెస్ లో నాకు పోటీ ఇచ్చేవాడు వచ్చాడు అంటూ కామెంట్ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా పోస్టు చేశారు.


More Telugu News