పాకిస్థాన్ డ్రోన్ల ద్వారా ఆయుధాలను జారవిడుస్తోంది: జమ్మూకశ్మీర్ డీజీపీ

  • పాకిస్థాన్ టెర్రరిజాన్ని పోషిస్తోంది
  • నార్కో టెర్రరిజాన్ని ఉపయోగిస్తోంది
  • డ్రగ్స్ స్మగ్లింగ్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం
అన్ని ఉగ్రవాద సంస్థలకు పాకిస్థాన్ సాయం చేస్తోందని జమ్మూకశ్మీర్ డీజీపీ దిల్ బాగ్ సింగ్ మండిపడ్డారు. అవకాశం లభించినప్పుడల్లా తీవ్రవాదాన్ని పెంచిపోషించడానికి యత్నిస్తోందని అన్నారు. తీవ్రవాదులకు నిధుల కోసం నార్కో టెర్రరిజాన్ని ఉపయోగిస్తోందని చెప్పారు. జమ్మూకశ్మీర్ లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తోందని అన్నారు. డ్రగ్స్ స్మగ్లింగ్ విషయంలో తాము కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు.

అక్రమ చొరబాట్లను పాక్ ప్రోత్సహిస్తోందని దిల్ బాగ్ సింగ్ తెలిపారు. డ్రోన్ల ద్వారా ఆయుధాలను జారవిడుస్తోందని చెప్పారు. ఈ ప్రక్రియకు అడ్డుకట్టవేయడం సవాల్ తో కూడుకున్న పని అని చెప్పారు. కష్టమైన పనే అయినా వాటిని నిలువరించడంలో కొంతమేర విజయం సాధించామని తెలిపారు.


More Telugu News