సీసీ ఫుటేజ్‌లు ఏమయ్యాయి? ఎవరిని రక్షించడం కోసం ఈ ప్రయత్నాలు?: దేవినేని ఉమ

  • ఏప్రిల్ 13న రథంపై సింహాలున్నాయి
  • చోరీ జరిగిందని తెలిసినా ఫిర్యాదు ఎందుకు చేయలేదు?
  • బాధ్యులైన మంత్రి, అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోలేదు?
ఏపీలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. విజయవాడ కనకదుర్గమ్మ రథంపై ఉన్న మూడు సింహాలు చోరీ కావడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ ఘటనను విపక్షాలు ముక్తకంఠంతో ఖండించాయి. తాజాగా ఈ ఘటనపై టీడీపీ నేత దేవినేని ఉమ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. మూడు సింహాల చోరీకి సంబంధించిన ఆధారాలను అధికారులు ఎందుకు మాయం చేశారని ప్రశ్నించారు.

మార్చి 15న రథానికి మెరుగు పెట్టినప్పుడు నాలుగు సింహాలు ఉన్నాయని... ఇప్పుడు సింహాలు మాయమైన తర్వాత చోరీ విషయం తెలిసినా మూడు రోజులు ఎందుకు ఫిర్యాదు చేయలేదని నిలదీశారు. దేవాలయంలోని సీసీటీవీ ఫుటేజీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఎవరిని రక్షించడం కోసం ఇదంతా చేస్తున్నారని అడిగారు. దీనికి బాధ్యులైన మంత్రి, అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.


More Telugu News