మందుల షాపుల్లో కరోనా ఔషధం అమ్మకానికి అనుమతించిన రష్యా!

  • ఇప్పటికే అవిఫావిర్ కు అనుమతి
  • తాజాగా కరోనావిర్ కు కూడా
  • అన్ని ఫార్మాస్యుటికల్స్ లో అందుబాటులోకి
డాక్టర్ ప్రిస్క్రిప్షన్ పై కొవిడ్-19 ఔషధాన్ని దేశంలోని మందుల షాపుల్లో విక్రయించేందుకు రష్యా అనుమతించింది. ఆర్- ఫార్మా తయారుచేసిన ఔషధం 'కరోనావిర్'ను స్వల్ప కరోనా లక్షణాలతో ఉండే ఔట్ పేషంట్లకు ఇచ్చేందుకు అనుమతినిచ్చింది. వచ్చే వారం నుంచి అన్ని ఫార్మాస్యుటికల్స్ లో దీన్ని అందుబాటులో ఉంచుతామని, దీన్ని ప్రిస్క్రిప్షన్ డ్రగ్ గా గుర్తిస్తున్నామని ప్రకటించింది.

కొవిడ్-19కు ఇప్పటికే వ్యాక్సిన్ ను ఆమోదించిన రష్యా, ఇంతకుముందే అవిఫావిర్ పేరిట ఓ ఔషధాన్ని అనుమతించిన సంగతి తెలిసిందే. అయితే అవిఫావిర్ ను విక్రయించేందుకు ఔషధ దుకాణాలకు అనుమతి లేదు. తాజాగా, మెడికల్ షాపుల్లో అమ్మకాలకు అనుమతినిస్తూ, ఇప్పుడు మరో ఔషధాన్ని కూడా విడుదల చేసింది. ఈ రెండు ఔషధాలూ కరోనాపై పనిచేస్తున్నాయని శాస్త్రవేత్తలు నిర్ధారించిన పావిపిరావిర్ ఆధారంగా తయారైనవే. దీన్ని జపాన్ అభివృద్ధి చేయగా, ప్రపంచవ్యాప్తంగా కరోనా చికిత్సలో వినియోగిస్తున్నారు.


More Telugu News