ఆ బిల్లులను వ్యతిరేకించండి: విపక్షాలకు కేజ్రీవాల్ వినతి
- కేంద్రం తీసుకొస్తున్న బిల్లులు రైతులకు వ్యతిరేకం
- విపక్షాలన్నీ ఈ బిల్లులను వ్యతిరేకించాలి
- సభ నుంచి ఎవరూ వాకౌట్ చేయొద్దు
వ్యవసాయరంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ బిల్లులు లోక్ సభ ఆమోదం పొందాయి. రాజ్యసభలో ఆమోదం పొందితే చట్టరూపం దాల్చనున్నాయి.
ఈ నేపథ్యంలో ఈ మూడు బిల్లులను రాజ్యసభలో వ్యతిరేకించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ బీజేపీయేతర పార్టీలను కోరారు. విపక్షాలకు సంబంధించి అన్ని పార్టీల రాజ్యసభ సభ్యులు సభకు హాజరుకావాలని చెప్పారు. సభ నుంచి వాకౌట్ చేయవద్దని, సభలోనే ఉండి బిల్లులను వ్యతిరేకించాలని సూచించారు. దేశంలో ఉన్న రైతులంతా మిమ్మల్ని గమనిస్తున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పారు. ఈ బిల్లులను ఆప్ వ్యతిరేకిస్తోందని చెప్పారు. ఇవి రైతు వ్యతిరేక బిల్లులని అన్నారు.