కరోనా సోకిందంటూ జూన్ 24న అదృశ్యమైన భర్త... ప్రేయసితో ఉన్నాడని తేల్చిన పోలీసులు!
- చనిపోతున్నానని భార్యకు ఫోన్ చేసి స్విచ్చాఫ్
- ఫోన్, ఇతర వస్తువులు సరస్సు వద్ద వదిలేసి ప్రేయసితో ఇండోర్ కు
- మృతదేహం లభ్యం కాకపోవడంతో సీసీటీవీ ఫుటేజ్ లు వెతికిన పోలీసులు
- ముంబైలో జరిగిన ఘటన
తనకు కరోనా సోకిందని, ఇక బతకబోనని భార్యకు ఫోన్ చేసి, ఆపై దాన్ని స్విచ్చాఫ్ చేసిన ప్రబుద్ధుడు, ప్రేయసితో కలిసి పారిపోయిన ఘటన ముంబైలో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన జూన్ 24న పోలీసుల దృష్టికి రాగా, అతను ప్రియురాలితో కలిసి ఉన్నాడని తేల్చడానికి పోలీసులకు దాదాపు మూడు నెలల సమయం పట్టింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల్లోకి వెళితే, ఓ ప్రైవేటు కంపెనీలో సూపర్ వైజర్ గా పనిచేస్తున్న మనీశ్ మిశ్రా, జూన్ లో తన భార్యకు ఫోన్ చేసి, కరోనా పాజిటివ్ వచ్చిందని, చచ్చిపోతున్నానని చెప్పి, ఫోన్ ను స్విచ్చాఫ్ చేశాడు.
దీంతో తీవ్ర ఆందోళనకు గురైన ఆమె, భర్త ఏ అఘాయిత్యం చేసుకున్నాడోనన్న భయంతో పోలీసులను ఆశ్రయించింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, అతని సెల్ ఫోన్ చివరిగా మాట్లాడిన ప్రాంతాన్ని సిగ్నల్స్ సాయంతో గుర్తించి వెళ్లగా, అతని బైక్, ఇతర వస్తువులు లభించాయి. ఆ పక్కనే ఓ సరస్సు ఉండటంతో, అతను అందులో దూకి ఉండవచ్చని భావించిన పోలీసులు, జాలర్ల సాయంతో తనిఖీలు జరిపించారు. ఎన్ని రోజులు వెతికించినా, మృతదేహం ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో అతను బతికే ఉండవచ్చని నమ్మిన పోలీసులు, మరో మార్గంలో విచారణ చేపట్టారు.
ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను అన్నింటినీ జల్లెడ పట్టడం ప్రారంభించారు. చాలా రోజుల తరువాత వారి ప్రయత్నం ఫలించింది. మనీశ్ మిశ్రా, ఓ మహిళతో కలిసి కారులో వెళుతున్నట్టు గుర్తించి, అతని గత చరిత్రపై విచారించగా, ఓ మహిళతో వివాహేతర బంధం ఉన్నట్టు తేలిపోయింది. దీంతో కేసును పరిష్కరించడం వారికి సులువైంది. అతను తన ప్రియురాలితో కలిసి ఇండోర్ లో ఎంజాయ్ చేస్తున్నాడని తేల్చిన పోలీసులు, అతన్ని అదుపులోకి తీసుకుని, ముంబైకి తీసుకుని వచ్చి, భార్య ముందు నిలిపారు.