ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అమిత్ షా

  • కరోనా నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ అనారోగ్యానికి గురైన అమిత్ షా
  • 4 రోజుల చికిత్స తర్వాత డిశ్చార్జ్ అయిన కేంద్ర మంత్రి
  • అమిత్ షా ఆరోగ్యం బాగుందన్న వైద్యులు
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్  అయ్యారు. కరోనా సోకడంతో మేదాంత ఆసుపత్రిలో ఆగస్ట్ 2న అమిత్ షా చేరారు. ఆ తర్వాత ఆయన కోలుకున్నారు. ఆగస్ట్ 14న డిశ్చార్జ్ అయ్యారు. అయితే డిశ్చార్జ్ అయిన తర్వాత శ్వాస సంబంధిత ఇబ్బందులు తలెత్తడంతో ఈ నెల 13న మళ్లీ ఆసుపత్రిలో చేరారు. నాలుగు రోజుల చికిత్స తర్వాత ఈరోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్  అయ్యారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వర్గాలు స్పందిస్తూ, అమిత్ షా ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని తెలిపారు.


More Telugu News