న్యాయ వ్యవస్థ పక్షపాతంతో వ్యవహరిస్తోంది: విజయసాయిరెడ్డి

  • అందరూ సమానులే అనే సూత్రాన్ని విస్మరిస్తోంది
  • ప్రాథమిక హక్కులను, మీడియా గొంతును నొక్కుతున్నాయి
  • ఏపీ హైకోర్టు ఉత్తర్వులపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి
న్యాయ వ్యవస్థ పక్షపాతంతో వ్యవహరిస్తోందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చట్టం ముందు అందరూ సమానులే అనే సూత్రాన్ని న్యాయ వ్యవస్థ విస్మరిస్తోందని చెప్పారు. ధర్మాన్ని కాపాడాల్సిన వారు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పౌరుల ప్రాథమిక హక్కులను హరిస్తున్నాయని, మీడియా గొంతు నొక్కుతున్నాయని జుడీషియరీపై ఆరోపణలు చేశారు. ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.

ఏపీలో న్యాయవ్యవస్థ నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలపై ఏపీ హైకోర్టు విధించిన స్టేలకు సంబంధించి న్యాయపరమైన అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయని చెప్పారు. పార్లమెంటు ప్రాంగణంలో వైసీపీ ఎంపీలతో కలిసి మీడియాతో మాట్లాడుతూ విజయసాయి పైవ్యాఖ్యలు చేశారు. ఇదే అంశాన్ని రాజ్యసభలో సైతం విజయసాయి లేవనెత్తారు.


More Telugu News