నితిన్ సినిమాకి ఓటీటీ నుంచి భారీ ఆఫర్.. వద్దనుకున్న నిర్మాతలు!

  • ప్రత్యామ్నాయంగా నిలిచిన ఓటీటీ ప్లాట్ ఫాం  
  • హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా టేబుల్ ప్రాఫిట్స్
  • థియేటర్లకే మొగ్గు చూపుతున్న పెద్ద హీరోలు
  • నితిన్ 'రంగ్ దే' సినిమాకి 35 కోట్ల ఆఫర్  
లాక్ డౌన్ వల్ల థియేటర్లు మూతబడడంతో ఓటీటీ ప్లాట్ ఫాంలు ప్రత్యామ్నాయంగా నిలిచాయి. సినిమా స్థాయిని బట్టి భారీ రేట్లు ఆఫర్ చేస్తూ పలువురు నిర్మాతలను ఆకర్షిస్తున్నాయి. హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా కళ్లముందే టేబుల్ ప్రాఫిట్స్ కనిపిస్తుండడంతో కొందరు నిర్మాతలు తమ చిత్రాలను డైరెక్టుగా డిజిటల్ రిలీజ్ కి ఇచ్చేస్తూ రిలాక్స్ అవుతున్నారు కూడా.

అయితే స్టార్ ఇమేజ్ వున్న హీరోల సినిమాలు మాత్రం అంతగా ఓటీటీలకు వెళ్లడం లేదు. ఆయా హీరోలు థియేటర్లకే మొగ్గు చూపుతుండడంతో సదరు చిత్రాల నిర్మాతలు ఓటీటీ కి వెళ్లలేకపోతున్నారు. ఈ క్రమంలో యంగ్ హీరో నితిన్ నటించిన 'రంగ్ దే' చిత్రానికి కూడా ఓటీటీ ప్లేయర్ల నుంచి మంచి ఆఫర్లు వచ్చాయట. ఒకరైతే ఏకంగా 35 కోట్ల వరకు ఆఫర్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది.

వాస్తవానికి నితిన్ సినిమాకి అది భారీ రేటే అయినప్పటికీ, మేకర్స్ మాత్రం ఇవ్వడానికి సముఖంగా లేరని తెలుస్తోంది. ఆలస్యమైనా సరే థియేటర్లకే వెళ్లాలని యోచిస్తున్నారట. కీర్తి సురేశ్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని తాజాగా నిర్ణయించినట్టు సమాచారం.


More Telugu News