'ఊర్మిళ ఓ పోర్న్ స్టార్' అన్న కంగన... నిన్నటి వరకూ మద్దతిచ్చిన వారి నుంచి నేడు విమర్శలు!
- హిమాచల్ డ్రగ్స్ కు కేంద్రమన్న ఊర్మిళ
- వెంటనే తీవ్ర విమర్శలకు దిగిన కంగన
- కంగనకు వ్యతిరేకమైపోయిన సోషల్ మీడియా
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తరువాత వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసు విషయంలో నటి కంగన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపగా, ఆమె సరిగ్గానే మాట్లాడిందంటూ, ఎంతో మంది మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా, ఆమె చేసిన వ్యాఖ్యలు ఇన్నాళ్లూ ఆమెకు మద్దతుగా నిలిచిన వారికీ ఆగ్రహం తెప్పించాయి. సీనియర్ నటి ఊర్మిళా మతోంద్కర్ ను ఓ సాఫ్ట్ పోర్న్ స్టార్ అంటూ కంగన వ్యాఖ్యానించడమే ఇందుకు కారణం.
అంతకుముందు ఊర్మిళ మాట్లాడుతూ, ఇండియా మొత్తం డ్రగ్స్ సమస్య ఉందని, కంగన సొంత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ మాదకద్రవ్యాలకు కేంద్ర బిందువన్న సంగతి ఆమెకు తెలుసా? ముందు సొంత రాష్ట్రం గురించి ఆలోచించాలని వ్యాఖ్యానించింది. దీనిపై స్పందించిన కంగన, ఓ టీవీ చానెల్ తో మాట్లాడుతూ, నేనంటున్న మాట కఠినమే అయినా, ఊర్మిళ ఓ సాఫ్ట్ పోర్న్ స్టార్. ఇదే నిజం. తాను గొప్పనటినని ఎన్నడూ నిరూపించుకోలేదు. ఆమె చేసిందేముంది? ఆమె పాలిటిక్స్ లోకి రాగాలేనిది, నేను వస్తే తప్పేంటని ప్రశ్నించింది.
కంగన వ్యాఖ్యలు వైరల్ కాగా, పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆమెను తప్పుబట్టారు. స్వరా భాస్కర్, అనుభవ్ సిన్హా వంటి వారు ఊర్మిళకు మద్దతుగా నిలిచారు. కంగన వ్యాఖ్యలు తోటి నటిని అగౌరవపరిచేవేనని అన్నారు.