సుశాంత్ కేసును దర్యాప్తు చేస్తున్న అధికారికి కరోనా.. ఆగిన దర్యాప్తు

  • రియా వాట్సాప్ సంభాషణల్లో శ్రుతి మోదీ, జయ సాహ పేర్లు
  • విచారణకు హాజరు కావాలంటూ ఎన్‌సీబీ ఆదేశాలు
  • అర్థాంతరంగా ఆగిన విచారణ
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసును దర్యాప్తు చేస్తున్న నార్కోటిక్స్ దర్యాప్తు బృందంలోని అధికారి కరోనా బారినపడడంతో విచారణను మధ్యలోనే నిలిపివేశారు. నిబంధనల ప్రకారం మిగతా సభ్యులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించిన అనంతరం తిరిగి విచారణను ప్రారంభించనున్నట్టు ఎన్‌సీబీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

అధికారి కరోనా బారినపడడంతో సుశాంత్ మాజీ బిజినెస్ మేనేజర్ శ్రుతి మోదీని ప్రశ్నించడం ఆగిపోయినట్టు ఎన్‌సీబీ డిప్యూటీ డైరెక్టర్ కేపీఎస్ మల్హోత్రా తెలిపారు. సుశాంత్ మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తి వాట్సాప్ సంభాషణల్లో శ్రుతి మోదీ, టాలెంట్ మేనేజర్ జయ సాహ పేర్లు కూడా ఉండడంతో వారిని ప్రశ్నించేందుకు ఎన్‌సీబీ రంగం సిద్ధం చేసింది. విచారణలో పాల్గొనేందుకు శ్రుతి ఎన్‌సీబీ గెస్ట్ హౌస్‌కు కూడా చేరుకున్నారు. అయితే, అధికారికి కరోనా కారణంగా విచారణను ప్రస్తుతానికి నిలిపివేశారు.


More Telugu News