రవితేజ కొత్త సినిమాలో సీరత్ కపూర్ కి ఛాన్స్

  • 'రన్ రాజా రన్'తో టాలీవుడ్ కి పరిచయం 
  • 'టచ్ చేసి చూడు'లో నటించిన సీరత్
  • తాజాగా రమేశ్ వర్మతో రవితేజ సినిమా
  • ఒక కథానాయికగా సీరత్ ఎంపిక  
మన టాలీవుడ్ లో ముంబై భామలకు వుండే క్రేజే వేరు. అందాల ప్రదర్శనలో ఏమాత్రం వెనుకంజ వేయరన్న ఉద్దేశంతో మన దర్శక నిర్మాతలు ఎక్కువగా ముంబై హీరోయిన్లకు ప్రాధాన్యమిస్తుంటారు. అందుకే, హీరోలు కూడా ముంబై అమ్మాయిలనే బుక్ చేయమని దర్శక నిర్మాతలకు సిఫార్సు చేస్తుంటారు.

ఈ నేపథ్యంలో ఆమధ్య 'టచ్ చేసి చూడు' సినిమాలో రవితేజకు జోడీగా నటించిన సీరత్ కపూర్ కి కూడా అలాగే మళ్లీ రవితేజ సరసన నటించే ఛాన్స్ వచ్చింది. 'రన్ రాజా రన్' చిత్రంతో టాలీవుడ్ ప్రవేశం చేసిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత 'టైగర్', 'కొలంబస్', 'ఒక్క క్షణం', 'టచ్ చేసి చూడు', 'కృష్ణా అండ్ హిజ్ లీల'.. వంటి కొన్ని సినిమాలలో నటించినప్పటికీ, హీరోయిన్ గా ఇంకా పెద్ద బ్రేక్ మాత్రం రాలేదు.

ఈ క్రమంలో రవితేజ హీరోగా నటించే సినిమాలో సీరత్ కు మళ్లీ హీరోయిన్ గా అవకాశం రావడం లక్కీ అనే చెప్పాలి. రమేశ్ వర్మ దర్శకత్వంలో రవితేజ ఓ చిత్రాన్ని ఒప్పుకున్నాడు. దీనికి 'ఖిలాడి' అనే టైటిల్ని కూడా నిర్ణయించినట్టు వార్తలొచ్చాయి. ఇప్పుడీ చిత్రంలో సీరత్ కపూర్ ని ఓ కథానాయికగా ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తాను చేస్తున్న 'క్రాక్' సినిమా పూర్తయ్యాక ఈ కొత్త చిత్రాన్ని రవితేజ ప్రారంభిస్తాడు.


More Telugu News