రియా చక్రవర్తితో నాకు ఎలాంటి పరిచయం లేదు: తాప్సీ

  • రియా ఎవరో నాకు తెలియదు
  • అయితే ఆమెను టార్గెట్ చేయడం బాధాకరం
  • ఇంత దారుణంగా ఎవరి పట్ల ప్రవర్తించలేదు
బాలీవుడ్ లో డ్రగ్స్ వాడకానికి సంబంధించి కొత్తకొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆత్మహత్యకు పాల్పడిన హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ప్రియురాలు రియా చక్రవర్తి జుడీషియల్ రిమాండ్ లో ఉంది. ఈ నేపథ్యంలో, టాలీవుడ్ నటి తాప్సీ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఒక వ్యక్తి తరచూ వివాదాస్పదంగా మాట్లాడితే కొన్ని రోజుల తర్వాత వారి వ్యాఖ్యలు ఇతరులపై ఎలాంటి ప్రభావాన్ని చూపవని వ్యాఖ్యానించింది. ఇదే మాదిరి కంగనా రనౌత్ మాటలు కూడా తనపై ఎలాంటి ప్రభావాన్ని చూపించలేవని చెప్పింది.

రియా చక్రవర్తి గురించి మాట్లాడుతూ... రియా ఎవరో తనకు తెలియదని తాప్సీ తెలిపింది. రియాతో తనకు ఎలాంటి పరిచయం లేదని చెప్పింది. అయితే సుశాంత్ ఆత్మహత్య కేసులో రియాను టార్గెట్ చేయడం, ఆమె పట్ల అన్యాయంగా వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే బాధగా ఉందని తెలిపింది. బాలీవుడ్ సెలెబ్రిటీల్లో చాలా మంది ఏదో ఒక సమయంలో తప్పు చేశారని... అయితే, వారెవరినీ రియాను చూసినంత దారుణంగా చూడలేదని ఆవేదన వ్యక్తం చేసింది.


More Telugu News