ఆసుపత్రికి తీసుకెళ్తున్న అంబులెన్సుకి నిప్పుపెట్టి.. చచ్చిపోతానంటూ రౌడీ షీటర్ హల్‌చల్
- ప్రకాశం జిల్లా ఒంగోలులో ఘటన
- వింతగా ప్రవర్తించిన మాజీ రౌడీషీటర్ సురేశ్
- 108కి రాంగ్‌కాల్స్ చేస్తుండటంతో అరెస్టు
- పోలీస్ స్టేషన్ అద్దాలను ధ్వంసం చేసిన వైనం
తనను ఆసుపత్రికి తీసుకెళ్తోన్న అంబులెన్సుకు నిప్పుపెట్టాడు ఓ మాజీ రౌడీ షీటర్. దీంతో అందులోని సిబ్బంది అంతా కిందకు దిగగా, తాను మాత్రం దిగబోనని, చచ్చిపోతానని, వింతగా నవ్వుతూ చెప్పాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటు చేసుకుంది. మాజీ రౌడీషీటర్ సురేశ్ 108కి రాంగ్‌కాల్స్ చేస్తుండటంతో సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ నిమిత్తం సురేశ్‌ను పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఈ రోజు తెల్లవారుజామున అక్కడ సురేశ్ వింతగా ప్రవర్తించడమే కాకుండా పోలీస్ స్టేషన్ అద్దాలను ధ్వంసం చేశాడు. ఆ సమయంలో సురేశ్ చేతికి గాయాలయ్యాయి. దీంతో అతనిని ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించేందుకు పోలీసులు 108 అంబులెన్స్ ను రప్పించారు.
ఆ క్రమంలో ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో తన వద్ద ఉన్న అగ్గిపెట్టెను జేబులోంచి బయటకు తీసిన సురేశ్ అంబులెన్స్ లోని కాటన్‌కు నిప్పుపెట్టాడు. దీంతో 108 వాహనం పూర్తిగా దగ్ధమైంది. తాను అందులోంచి దిగనని సురేశ్ చెప్పడంతో పోలీసులు అతికష్టం మీద అతనిని అంబులెన్స్‌లో నుంచి బయటకు తీసుకొచ్చారు. అనంతరం వేరే వాహనంలో ఒంగోలు రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అతడి మానసిక పరిస్థితి బాగోలేదని పోలీసులు భావిస్తున్నారు.