ఎస్‌బీఐ ఏటీఎం నుంచి ఎక్కువ మొత్తం డ్రా చేయాలనుకుంటే.. ఓటీపీ తప్పనిసరి!
- రూ.10 వేల కంటే ఎక్కువ తీసుకోవాలంటే తప్పనిసరి
- ఇప్పటివరకు రాత్రి 8 నుంచి ఉదయం 8 వరకు నిబంధన
- ఇకపై ఈ నెల 18 నుంచి రోజంతా అమల్లోకి
ఎస్‌బీఐ ఏటీఎంలలో రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల మధ్య రూ.10 వేలు లేక అంతకంటే కంటే ఎక్కువ డబ్బును విత్ డ్రా చేసుకోవాలంటే కస్టమర్ల మొబైల్‌కు వచ్చే ఓటీపీ నంబర్ ఎంటర్ చేయడం ఇప్పటివరకు అమల్లో ఉంది. అయితే, ఇకపై 24 గంటల పాటు ఈ నిబంధన అమల్లోకి రానుంది. ఈ నెల 18 నుంచి రూ.10 వేలు లేక అంతకంటే ఎక్కువ నగదు తీసుకుంటే డెబిట్ కార్డు పిన్ నంబరునే కాకుండా, ఓటీపీని కూడా నమోదు చేయాల్సిందేనని ఎస్‌బీఐ తెలిపింది.
మరోవైపు, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుదారులకు క్రెడిట్ స్కోరు తెలుసుకునే సదుపాయాన్ని కల్పిస్తామని ఆ బ్యాంకు తెలిపింది. అమెరికాలో మాదిరిగా మరికొన్ని సదుపాయాలు కూడా కల్పించాలనుకుంటున్నట్లు పేర్కొంది. క్రెడిట్‌కార్డు ఉన్న వారు వారి ఖాతా నుంచి క్రెడిట్ స్కోరు తెలుసుకునేందుకు ఖాతాలోకి లాగిన్ అయి తెలుసుకోవచ్చని, ఇందుకోసం ఎటువంటి చెల్లింపులూ చేసే అవసరం లేదని తెలిపింది. కస్టమర్లకు ఉపయోగపడే ఈ ఫీచర్‌ను వెంటనే అమలు చేయడానికి ప్రయత్నిస్తామని తెలియజేసింది.