వచ్చే ఏడాది జనవరి 27న శశికళ విడుదల.. రూ. 10 కోట్లు చెల్లిస్తేనే!
- అక్రమాస్తుల కేసులో దోషిగా తేలిన శశికళ
- 2017 నుంచి బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో
- ఆర్టీఐ దరఖాస్తుకు జైళ్ల శాఖ సమాధానం
అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే నాయకురాలు వీకే శశికళ వచ్చే ఏడాది జనవరి 27న జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే, అందుకామె రూ. 10 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని కర్ణాటక జైళ్ల శాఖ తెలిపింది. రూ. 66 కోట్ల అక్రమాస్తుల కేసులో దోషిగా తేలిన శశికళ 2017 నుంచి బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉంటున్నారు.
జైలు రికార్డుల ప్రకారం శశికళ (నంబరు 9234) బహుశా వచ్చే ఏడాది జనవరి 27న విడుదలయ్యే అవకాశం ఉందని పరప్పన అగ్రహార జైలు సూపరింటెండెంట్ ఆర్. లత, ఆర్టీఐ కింద వచ్చిన దరఖాస్తుకు సమాధానంగా పేర్కొన్నారు. ఈ నెల 11న టి. నరసింహమూర్తి అనే కార్యకర్త ఈ దరఖాస్తు చేశారు.
ఒకవేళ శశికళ జరిమానా చెల్లించకుంటే మాత్రం 27 ఫిబ్రవరి 2022 వరకు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అయితే, శశికళ కనుక పెరోల్‌ను ఉపయోగించుకుంటే ఆమె విడుదల తేదీలో మార్పులు ఉండొచ్చన్నారు. ఆమె రూ. 10 కోట్లు చెల్లిస్తే మాత్రం జనవరి 27న విడుదల కావొచ్చని లత స్పష్టం చేశారు.