డ్రగ్స్ కేసులో కన్నడ స్టార్ కపుల్ కు సమన్లు.. పరారీలో మాజీ మంత్రి కుమారుడు!
- కన్నడ పరిశ్రమను కుదిపేస్తున్న డ్రగ్స్ వ్యవహారం
- దిగంత్, ఐంద్రితలకు సీసీబీ సమన్లు
- పరారీలో మాజీ మంత్రి కుమారుడు ఆదిత్య అల్వా
డ్రగ్స్ వ్యవహారం కన్నడ సినీ పరిశ్రమను కుదిపేస్తోంది. ఇప్పటికే హీరోయిన్లు సంజన, రాగిణిలతో పాటు పలువురిని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా కన్నడ నటీనటులు, స్టార్ కపుల్ దిగంత్, ఐంద్రితలకు సీసీబీ పోలీసులు సమన్లు జారీ చేశారు. రేపు ఉదయం 11 గంటలకు తమ కార్యాలయానికి హాజరుకావాలని ఆదేశించారు.
ఈ కేసులో కీలక నిందితుడైన షేక్ ఫాజిల్ శ్రీలంకలోని ఐ బార్టనే అనే క్యాసినోకు వీరిని ఆహ్వానించిన వీడియో వైరల్ అవుతోంది. దీని ఆధారంగా వీరికి సమన్లు జారీ అయ్యాయి. మరోవైపు కర్ణాటక మాజీ మంత్రి జీవరాజ్ అల్వా కుమారుడు ఆదిత్యపై కేసు నమోదైంది. ఆయనకు చెందిన రిసార్ట్ పై ఈ ఉదయం సీసీబీ పోలీసులు రెయిడ్ చేశారు. అయితే ఆదిత్య ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఆయన కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.