ఇద్దరు యంగ్ హీరోలతో మల్టీస్టారర్ ప్లానింగ్!

  • రానా, నాని బయట మంచి స్నేహితులు 
  • వీరితో మల్టీస్టారర్ కి సురేశ్ బాబు ప్లానింగ్
  • కథ తయారుచేస్తున్న ప్రముఖ దర్శకుడు
  • యాక్షన్ ఎంటర్ టైనర్ గా నిర్మాణం
పూర్వపు రోజుల్లోలా కాకుండా నేటితరం హీరోల మధ్య  మంచి స్నేహ సంబంధాలు వున్నాయి. ఫోనులు చేసుకోవడం.. తరచూ కలవడం.. సోషల్ మీడియాలో సరదాగా ముచ్చటించుకోవడం.. ఒకరి సినిమా హిట్టయితే మరొకరు కంగ్రాట్స్ చెప్పడం.. వంటి సన్నిహిత సంబంధాలు బాగా ఉంటున్నాయి. వృత్తి పరమైన జెలసీ అన్నది అస్సలు కనిపించదు. అందుకే అప్పుడప్పుడు మల్టీ స్టారర్ చిత్రాలు కూడా వస్తున్నాయి.

అలాగే, దగ్గుబాటి రానా, నాని కూడా మంచి స్నేహితులు. ఇద్దరి మధ్య మంచి అనుబంధం వుంది. ఇప్పుడు వీరిద్దరూ కలసి ఓ మల్టీ స్టారర్ లో నటించే సూచనలు కనిపిస్తున్నాయి. వీరిద్దరితోనూ ఓ భారీ చిత్రాన్ని నిర్మించడానికి రానా తండ్రి సురేశ్ బాబు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఓ ప్రముఖ దర్శకుడు ఇప్పటికే వీరికి సూటయ్యే కథపై వర్క్ చేస్తున్నట్టు చెబుతున్నారు.

ఈ చిత్రాన్ని యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నారట. హీరోయిన్లు కూడా టాప్ కేటగిరీ అమ్మాయిలే ఉంటారని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడవుతాయి.


More Telugu News