ఈ సమస్యకు కాంగ్రెస్, టీడీపీనే కారణం: కేసీఆర్
- విద్యుత్ సమస్యలకు కాంగ్రెస్, టీడీపీనే కారణం
- కేంద్ర చట్టంలో కూడా అనేక లోపాలున్నాయి
- కొత్త విద్యుత్ మీటర్లతో రైతులకు నష్టం
కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సమస్యలకు గతంలో పాలించిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలే కారణమని ఆరోపించారు. కేంద్ర విద్యుత్ చట్టంలో కూడా అనేక లోపాలున్నాయని మండిపడ్డారు. విద్యుత్ రంగంలో రాష్ట్రాలకు ఉన్న హక్కులను కేంద్రం హరించివేసిందని చెప్పారు. కేంద్ర విద్యుత్ చట్టాన్ని పార్లమెంటులో టీఆర్ఎస్ వ్యతిరేకిస్తుందని అన్నారు.
ప్రజల అవసరాలను తీర్చే ప్రణాళిక కేంద్రం వద్ద లేదని కేసీఆర్ అన్నారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టం ప్రకారం ప్రతి బోరుకు మీటర్ పెట్టాలని... దీని కోసం రూ. 700 కోట్ల బడ్జెట్ అవసరమవుతుందని చెప్పారు. మీటర్ రీడింగ్ తీసిన తర్వాత రైతుల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తారని అన్నారు. కేంద్రం తెచ్చిన కొత్త విద్యుత్ చట్టం వల్ల రాష్ట్రాలకు ఎలాంటి నియంత్రణ ఉండదని చెప్పారు. దేశంలో 4 లక్షల మెగావాట్ల విద్యుదుత్పత్తి ఉందని... మిగులు విద్యుత్ ను దేశ ప్రగతి కోసం వినియోగించాలని అన్నారు. విద్యుత్ బిల్లులు తగ్గేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.