ఎవరినైనా ఎత్తుకెళ్లి పోవడం ఏపీలో అలవాటయ్యింది: దేవినేని ఉమ

  • ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ వ్యవస్థపై హైకోర్టు సీరియస్
  • ప్రతిసారీ సీబీఐ విచారణ వేయలేం అంది
  • రాష్ట్రంలో ప్రాథమిక హక్కులనేవి ఉన్నాయా?
  • ఐపీసీ కాదు వైసీపీ కోడ్ అమలు చేస్తున్నారా?  
ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ వ్యవస్థపై హైకోర్టు సీరియస్ అయ్యిందంటూ మీడియాలో వచ్చిన కథనాలను పోస్ట్ చేస్తూ వైసీపీ సర్కారుపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. ఏపీలో పోలీసు వ్యవస్థ గాడితప్పుతోందని కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందని అందులో ఉంది.

అమలాపురం మండలంలోని ఇందుపల్లిలో వెంకటరాజు అనే వ్యక్తి అదృశ్యం కావడంపై హైకోర్టులో హెబియస్ కార్పస్ దాఖలు కావడంతో ఈ విషయంలో పోలీసుల తీరును హైకోర్టు తప్పుబట్టిందని సదరు పత్రికలో పేర్కొన్నారు. గతంలోనూ మూడు కేసుల్లో జుడిషియల్ విచారణ చేస్తే పోలీసులదే తప్పని తేలిందని అందులో ప్రస్తావించారు. ప్రతి కేసులో సీబీఐ విచారణ సాధ్యం కాదని స్పష్టం చేసినట్లు పలు ఛానెళ్లలో పేర్కొన్నారు. వీటిని దేవినేని ఉమ ప్రస్తావించారు.

'ఎవరినైనా ఎత్తుకెళ్లి పోవడం ఏపీలో అలవాటయ్యింది. ప్రతిసారీ సీబీఐ విచారణ వేయలేం. రాష్ట్రంలో ప్రాథమిక హక్కులనేవి ఉన్నాయా? మెజిస్ట్రేట్ విచారణ జరిగిన మూడు సార్లు పోలీసులదే తప్పని తేలింది. ఐపీసీ కాదు వైసీపీ కోడ్ అమలు చేస్తున్నారా? ఖాకీస్ట్రోక్రసి అంటే ఏంటో ప్రజలకు చెప్పండి వైఎస్ జగన్ గారు' అని దేవినేని ఉమ ప్రశ్నించారు.


More Telugu News