ఆంధ్రప్రదేశ్ మంత్రి ముత్తంశెట్టి, ఆయన కుమారుడికి సోకిన కరోనా!
- ఇటీవల నమూనాలు ఇచ్చిన ముత్తంశెట్టి
- ఆయనకు, ఆయన కుమారుడికి పాజిటివ్
- హోమ్ ఐసోలేషన్ లో ఉన్నామని వెల్లడి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ముందు జాగ్రత్తగా ఇటీవల ఆయన తన నమూనాలను ఇచ్చి, పరీక్షలు చేయించుకోగా, పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన ఐసోలేషన్ లోకి వెళ్లారు.
ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని, తనను ఇటీవలి కాలంలో కలిసిన వారంతా కరోనా టెస్ట్ చేయించుకోవాలని, తమ వారితో జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. తాను అందరికీ ఫోన్ లో అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. కాగా, ముత్తంశెట్టి కుమారుడు వెంకట శివసాయి నందీశ్ కు కూడా వైరస్ సోకినట్టు తేలింది. తండ్రికి పాజిటివ్ వచ్చినట్టు తెలియగానే ఆయన కూడా టెస్ట్ చేయించుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరికీ ఇంట్లోనే వైద్యులు చికిత్స చేస్తున్నారు.