నకిలీ చెక్కులతో రామ జన్మభూమి ట్రస్టు ఖాతా నుంచి రూ.6 లక్షలు డ్రా... వెంటనే స్పందించిన ఎస్బీఐ

  • పోలీసులకు ఫిర్యాదు చేసిన ట్రస్టు కార్యదర్శి
  • లక్నోలోని పీఎన్బీ బ్రాంచిలో లావాదేవీలు జరిగినట్టు గుర్తింపు
  • వెంటనే రూ.6 లక్షలను తిరిగి ట్రస్టు ఖాతాలో జమచేసిన ఎస్బీఐ
అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం ఏర్పాటైన రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు చెందిన బ్యాంక్ అకౌంట్ నుంచి కొందరు వ్యక్తులు నకిలీ చెక్కులు, ఫోర్జరీ సంతకాలతో రూ.6 లక్షలు డ్రా చేసినట్టు వెల్లడైంది. దీనిపై ట్రస్టు కార్యదర్శి చంపత్ రాయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు నకిలీ చెక్కులతో రూ.3.5 లక్షలు, రూ.2.5 లక్షలు.. మొత్తం రూ.6 లక్షలు విత్ డ్రా చేశారని ఆరోపించారు.

ఈ విషయంపై సమాచారం అందుకున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వెంటనే స్పందించింది. ఈ చెక్కులను లక్నోలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రాంచిలో మార్చినట్టు గుర్తించడమే కాకుండా, ఆ రూ.6 లక్షలను తిరిగి రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టులో జమచేసింది. దీనిపై స్పందించిన ట్రస్టు వర్గాలు ఎస్బీఐకి కృతజ్ఞతలు తెలిపాయి.


More Telugu News