రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా హరివంశ్ సింగ్ మరోసారి ఎన్నిక
- ఎన్డీయే అభ్యర్థిగా హరివంశ్ సింగ్
- విపక్ష అభ్యర్థిగా మనోజ్ కుమార్ ఝా
- మూజువాణి పద్ధతిలో ఓటింగ్
- హరివంశ్ సింగ్ గెలిచినట్టు ప్రకటించిన వెంకయ్యనాయుడు
జేడీయూ నేత, ఎన్డీయే అభ్యర్థి హరివంశ్ సింగ్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా మరోసారి ఎన్నికయ్యారు. డిప్యూటీ చైర్మన్ పదవి కోసం హరివంశ్ పేరును బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పెద్దల సభలో ప్రతిపాదన చేయగా, కేంద్రమంత్రి తవర్చంద్ గెహ్లాట్ బలపరిచారు. అటు, విపక్ష అభ్యర్థిగా మనోజ్ కుమార్ ఝా పేరును కాంగ్రెస్ సభ్యుడు గులాంనబీ అజాద్ ప్రతిపాదించగా, కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ బలపరిచారు.
మూజువాణి పద్ధతిలో ఓటింగ్ నిర్వహించారు. ఈ ఓటింగ్ లో హరివంశ్ సింగ్ విజయం సాధించినట్టు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు.
హరివంశ్ తొలిసారిగా 2018 ఆగస్టు 8న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా ఎన్నికయ్యారు. అయితే రాజ్యసభ సభ్యుడిగా ఆయన పదవీకాలం 2020 ఏప్రిల్ తో ముగిసింది. అనంతరం మరోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 64 ఏళ్ల హరివంశ్ సింగ్ ఎకనామిక్స్ లో మాస్టర్స్ డిగ్రీ అందుకున్నారు. ఆయన గతంలో ప్రభాత్ ఖబర్ అనే పత్రికకు చీఫ్ ఎడిటర్ గా వ్యవహరించారు.