చివరి నిమిషంలో రఘురామకృష్ణరాజుకు షాక్ ఇచ్చిన వైసీపీ!
- ఎంపీలతో ఈ ఉదయం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన జగన్
- కాన్ఫరెన్స్ కు హాజరు కావాలని రఘురాజుకు తొలుత సమాచారం
- ఆ తర్వాత కాన్ఫరెన్స్ కు హాజరు కావద్దని ఫోన్ కాల్
పార్లమెంటు సమావేశాలు ఈరోజు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఉదయం పార్టీ ఎంపీలతో ముఖ్యమంత్రి జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉభయ సభల్లో వ్యవహరించాల్సిన తీరుపై మార్గనిర్దేశం చేశారు. మరోవైపు ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఏపీ భవన్ అధికారులు రఘురాజుకు సమాచారం అందించారు.
అయితే, వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనేందుకు ఆయన సిద్ధమవుతున్న సమయంలో ఏపీ భవన్ అధికారులు మరోసారి ఫోన్ చేశారు. వీడియో కాన్ఫరెన్స్ కు హాజరుకావద్దని కోరారు. దీంతో, రఘురాజు షాక్ కు గురైనట్టు తెలుస్తోంది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పార్టీ నుంచి తనను బహిష్కరించినట్టు అర్థమవుతోందని వ్యాఖ్యానించారు.
కాగా, వైస్సార్సీపీ ఎంపీ మిధున్ రెడ్డి మాట్లాడుతూ.. డిస్ క్వాలిఫికేషన్ అనేదే మా స్టాండ్ ఆయన్నేమి సస్పెండ్ చేయబోవడంలేదని చెప్పారు.