అధిక ఫీజులు వసూలు చేస్తోన్న పాఠశాలపై సినీనటుడు శివబాలాజీ హెచ్ఆర్సీలో ఫిర్యాదు
- ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తూ అధిక ఫీజుల వసూళ్లు
- ప్రశ్నిస్తే నా పిల్లల ఐడీలు బ్లాక్ చేసిన స్కూలు సిబ్బంది
- మణికొండలోని మౌంట్ లిటేరా జీ స్కూల్ నిర్వాకం ఇది
- ప్రభుత్వ ఆదేశాలను కూడా పట్టించుకోవట్లేదు
కరోనా నేపథ్యంలో పాఠశాల విద్యార్థులకు యాజమాన్యాలు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. అయితే, తన పిల్లలు ఆ క్లాసులకు అటెండ్ కాకుండా, మణికొండలోని మౌంట్ లిటేరా జీ స్కూల్ వాళ్ల ఐడీలను బ్లాక్ చేసిందని సినీనటుడు శివబాలాజీ మానవ హక్కుల కమిషన్ ( హెచ్ఆర్సీ)లో లో ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిరిస్తోందని ఆరోపించారు.
ఆ స్కూలు యాజమాన్యం బలవంతంగా ఫీజులను వసూలు చేస్తోందని, ప్రభుత్వ ఆదేశాలను కూడా పట్టించుకోవడం లేదని అన్నారు. ఫీజు వసూలు కోసమే అనవసర పరీక్షలు నిర్వహిస్తోందని తెలిపారు. ఎవరైనా ప్రశ్నిస్తే పిల్లలకు ఆన్‌లైన్ క్లాసులు చెప్పకుండా ఐడీ బ్లాక్ చేస్తుందని, ఈ పరిస్థితే తనకు ఎదురైందని చెప్పారు.
కాగా, టాలీవుడ్‌లో ఆర్య, సంక్రాంతి, చందమామ, శంభో శివ శంభో వంటి సినిమాల్లో నటించి శివబాలాజీ మంచి పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. 2009లో శివ బాలాజీ నటి మధుమితని పెళ్లి చేసుకున్నారు. వీరికి ధన్విన్, గగన్ అనే ఇద్దరు కుమారులున్నారు.