ఆ సినిమా ఇంకా ఫైనల్ కాలేదంటున్న శ్రియ!
- ఆయుష్మాన్ నటించిన 'అందాధున్'
- నితిన్ హీరోగా తెలుగులో రీమేక్
- టబు పాత్రకు శ్రియతో సంప్రదింపులు
- ఇంకా తాను ఓకే చెప్పలేదని వివరణ
హిందీలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా వచ్చిన 'అందాధున్' చిత్రం అక్కడ మంచి హిట్టయింది. ఇప్పుడీ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. హిందీ వెర్షన్లో టబు ఓ కీలక పాత్ర పోషించింది. తెలుగు రీమేక్ లో ఈ పాత్రకు పలువురు తారలను పరిశీలిస్తున్నారు.
ఈ క్రమంలో ప్రముఖ నటి శ్రియ ఈ పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనీ, ఆమె ఎంపిక ఖరారైందనీ ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే, ఈ చిత్రానికి తాను ఓకే చెప్పినట్టుగా వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని శ్రియ తాజాగా పేర్కొంది. 'ఈ చిత్రం యూనిట్ నన్ను అడిగిన మాట, నన్ను సంప్రదించిన మాట వాస్తవమే. అయితే, ఇంకా ఫైనల్ కాలేదు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి' అని చెప్పింది.
ప్రస్తుతం తాను రాజమౌళి రూపొందిస్తున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో మాత్రమే నటిస్తున్నానని చెప్పింది. అందులో అజయ్ దేవగణ్ సరసన నటిస్తున్నానని, అలాంటి గొప్ప నటుడితో నటించడం తన అదృష్టమని తెలిపింది.