రజనీ పార్టీలో చేరుతా.. అయితే ఒక కండిషన్: లారెన్స్ రాఘవ
- సీఎం అభ్యర్థిగా రజనీ మాత్రమే ఉండాలన్న లారెన్స్
- వేరే అభ్యర్థిని ప్రకటిస్తే ఒప్పుకోనని వ్యాఖ్య
- అనుభవం ఉన్న వ్యక్తే సీఎం అభర్థి అని గతంలో రజనీ ప్రకటన
త్వరలోనే తాను రాజకీయ రంగప్రవేశం చేయబోతున్నట్టు సినీ డైరెక్టర్, కొరియోగ్రాఫర్, నటుడు రాఘవ లారెన్స్ ఇటీవల సంచలన ప్రకటన చేశాడు. తన గురువు రజనీకాంత్ పార్టీలో చేరబోతున్నానని చెప్పాడు. ఆయన ప్రకటన తమిళనాట ఆసక్తికరంగా మారింది. కోలీవుడ్ లో చర్చనీయాంశమైంది.
తాజాగా ఈ అంశంపై లారెన్స్ మరోసారి స్పందించాడు. రజనీకాంత్ ముఖ్యమంత్రి అభ్యర్థి అయితేనే తాను ఆ పార్టీలో చేరుతానని... ఇతర వ్యక్తిని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే తాను అంగీకరించబోనని ట్వీట్ చేశాడు. ఇది కేవలం తన అభిప్రాయం మాత్రమే కాదని... రజనీ అభిమానులందరి కోరిక ఇదేనని అన్నాడు.
రజనీ తన ప్రకటనపై పునరాలోచిస్తారని తాను కోరుతున్నానని చెప్పాడు. రజనీని ఒప్పించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని తెలిపాడు. ఇప్పటికైతే రజనీనే సీఎం అభ్యర్థిగా ఉండాలని, భవిష్యత్తులో మరెవరు ముఖ్యమంత్రి అభ్యర్థి అయినా తనకు అభ్యంతరం లేదని చెప్పాడు.
తాను ముఖ్యమంత్రి అభ్యర్థిని కాదని గతంలో రజనీ ప్రకటించిన సంగతి తెలిసిందే. పార్టీలో అనుభవం ఉన్న వ్యక్తిని సీఎం క్యాండిడేట్ గా ఎంపిక చేస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో, లారెన్స్ తన మనసులోని మాటను వెల్లడించాడు. మరోవైపు రజనీ పార్టీలో చేరేందుకు సినీపరిశ్రమకు చెందిన పలువురు ఆసక్తిని కనబరుస్తున్నారు.