కాకినాడ, రాజమహేంద్రవరంలను కలిపి జంటనగరాలుగా అభివృద్ధి చేయాలి: లోక్‌సభలో వైసీపీ ఎంపీ మార్గాని భరత్

  • ఆ ప్రాంతాన్ని స్మార్ట్ సిటీగా ప్రకటించాలి
  • మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులు చేపట్టాలి
  • రాజమహేంద్రవరం చారిత్రక ప్రాధాన్యమున్న నగరం
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం గురించి వైసీపీ ఎంపీ మార్గాని భరత్ లోక్‌సభలో‌ ప్రస్తావించారు. ఆ ప్రాంతాన్ని స్మార్ట్ సిటీగా ప్రకటించాలని కోరారు. మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులు చేపట్టాలన్నారు. రాజమహేంద్రవరం చారిత్రక ప్రాధాన్యమున్న నగరమని గుర్తుచేశారు.  

పర్యాటక, విద్య, ఆరోగ్య కేంద్రంగా మారేందుకు ఆ నగరానికి అర్హతలన్నీ ఉన్నాయని, అక్కడ ఘన వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టులూ నిర్మించాలని చెప్పారు. ఇటీవల మరో 21 పంచాయతీలు అందులో కలిశాయని తెలిపారు. కాకినాడతో కలిపి రాజమహేంద్రవరాన్ని జంటనగరాలుగా అభివృద్ధి చేయాలని కోరారు.


More Telugu News