560 మంది చిన్నారులకు సచిన్ టెండూల్కర్ సాయం
- మధ్యప్రదేశ్‌లోని సెహోర్ జిల్లాలో విద్యార్థులకు సాయం
- గిరిజన చిన్నారులకు పోషకాహారం, విద్య
- ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి సాయం
ఇప్పటికే ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాల్లో పాల్గొని సేవలు అందించిన టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తాజాగా 560 మంది విద్యార్థులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. మధ్యప్రదేశ్‌లోని సెహోర్ జిల్లాలోని సెవానియా, బీల్పాటి, ఖాపా, నయాపుర, జమున్ ఝిల్‌లోని గిరిజన తెగలకు చెందిన పాఠశాల విద్యార్థులు సరైన పోషకాహారం, విద్య అందక ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు.
ఈ విషయం తెలుసుకున్న సచిన్ వెంటనే స్పందించి.. ఎన్టీవో పరివార్ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి ఆ విద్యార్థులకు తన 'టెండూల్కర్ ఫౌండేషన్' ద్వారా వాటిని అందించడానికి నిర్ణయించారు. మరోపక్క, యూనిసెఫ్‌కు గుడ్‌విల్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సచిన్, చిన్నారుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు.
ఈ క్రమంలో ముంబైలోని ఎస్‌ఆర్‌సీసీ పిల్లల ఆసుపత్రిలో చిన్నారులకు వైద్యం కోసం ఆయన ఆర్థిక సాయం చేశారు. గత ఏడాది స్ప్రెడ్ హ్యాపీనెస్ ఇన్ దియా ఫౌండేషన్ ద్వారా డిజిటల్ తరగతి గదుల కోసం సౌర లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయించారు.