టిక్ టాక్ కొనుగోలుకు మైక్రోసాఫ్ట్ చేసిన యత్నాలు విఫలం!
- పోటీపడ్డ మెక్రోసాఫ్ట్, ఒరాకిల్
- టిక్ టాక్ ను అమ్మేందుకు బైట్ డ్యాన్స్ సిద్ధంగా లేదన్న మైక్రోసాఫ్ట్
- టిక్ టాక్ భవితవ్యంపై నెలకొన్న సందిగ్ధత
అమెరికాలోని టిక్ టాక్ కార్యకలాపాలను యూఎస్ సంస్థ సొంతం చేసుకుంటేనే దాన్ని కొనసాగిస్తామని... లేని పక్షంలో టిక్ టాక్ ను నిషేధిస్తామంటూ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టిక్ టాక్ ను సొంతం చేసుకునేందుకు మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ సంస్థలు పోటీ పడ్డాయి. అయితే, టిక్ టాక్ తో మైక్రోసాఫ్ట్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. టిక్ టాక్ ను అమ్మేందుకు దాని మాతృసంస్థ బైట్ డ్యాన్స్ సిద్ధంగా లేదని మైక్రోసాఫ్ట్ తెలిపింది. ఈ నేపథ్యంలో, అమెరికాలో టిక్ టాక్ భవితవ్యంపై సందిగ్ధత నెలకొంది.