ఆ వార్తలు అవాస్తవం.. బీజేపీలో చేరికపై నటుడు విశాల్ స్పష్టీకరణ
- అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో వేడెక్కిన రాజకీయ వాతావరణం
- బీజేపీ తమిళనాడు చీఫ్ అపాయింట్‌మెంట్ కోరాడంటూ విశాల్‌పై వార్తలు
- బీజేపీలో చేరబోనంటూ కుండ బద్దలు కొట్టిన విశాల్
తాను బీజేపీలో చేరబోతున్నట్టు వస్తున్న వార్తలపై తమిళ నటుడు విశాల్ స్పందించాడు. విశాల్ త్వరలో బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నాడంటూ ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కేనగర్ ఉప ఎన్నికల బరిలో నిలిచి నామినేషన్ కూడా దాఖలు చేసిన విశాల్ చివరి క్షణంలో తన నామినేషన్ ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. తాజాగా, ఇప్పుడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సిద్ధమవుతుండడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. కోలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు ఎన్నికల బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో విశాల్ బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మురుగన్ అపాయింట్‌మెంట్‌ను విశాల్ కోరాడని ఇటు ప్రధాన మీడియాతోపాటు అటు సోషల్ మీడియాలోనూ వార్తలు హోరెత్తాయి. దీంతో స్పందించిన విశాల్ ఓ తమిళ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను బీజేపీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదన్నాడు. అంతేకాదు, బీజేపీలో చేరే ప్రసక్తే లేదని స్పష్టం చేశాడు.