మరో పెద్ద కుట్రకు తెరతీసిన చైనా.. రాష్ట్రపతి నుంచి సీజేఐ వరకు అందిరిపైనా గూఢచర్యానికి కంపెనీలతో ఒప్పందం!
- మొత్తం పదివేల మందిపై గూఢచర్యం
- చైనా కంపెనీలతో ఒప్పందం
- జాతీయ పత్రిక సంచలన కథనం
భారత్‌తో చీటికి మాటికి కయ్యానికి కాలుదువ్వుతూ ఉద్రిక్తతలకు కారణమవుతున్న చైనా మరో భారీ కుట్రకు తెరలేపింది. భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ సహా సీజేఐ వరకు దాదాపు పదివేల మందిపై గూఢచర్యానికి తెరలేపిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. రాష్ట్రపతి, ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డేతోపాటు కేంద్రమంత్రులపై గూఢచర్యానికి కుట్ర పన్నినట్టు జాతీయ పత్రిక ఒకటి సంచలన కథనాన్ని ప్రచురించింది. గూఢచర్యం నెరిపేందుకు కొన్ని కంపెనీలతో చైనా ఒప్పందం కుదుర్చుకుందని రాసుకొచ్చింది.
ఆ కథనం ప్రకారం.. ఈ మొత్తం గూఢచర్యానికి ప్రభుత్వంతో దగ్గరి సంబంధాలు ఉన్న ‘షెంజేన్’ అనే సంస్థ నేతృత్వం వహిస్తోంది. గల్వాన్ ఘటన తర్వాత భారత ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తుండడం, ఆ దేశ వస్తువులు, యాప్‌లపై నిషేధంతో ఉడికిపోతున్న చైనా ఈ దుశ్చర్యకు పూనుకున్నట్టు కథనం పేర్కొంది.
చైనా గూఢచర్యానికి పన్నిన కుట్రలో రాష్ట్రపతి, ప్రధాని, సీజేఐతోపాటు కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ, ఆమె కుటుంబం, మమతా బెనర్జీ, ఉద్ధవ్ థాకరే, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, పీయూష్ గోయల్, బిపిన్ రావత్‌తోపాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వ్యాపారవేత్తలు కలిపి దాదాపు 10 వేల మంది ఉన్నట్టు సమాచారం.
వీరి డిజిటల్ జీవితాలను చైనా కంపెనీలు అనుసరిస్తున్నాయని, వారి కుటుంబ సభ్యులు, మద్దతుదారుల పనితీరుపైనా చైనా కంపెనీలు నిఘా పెట్టాయని పత్రిక తన కథనంలో పేర్కొంది. వీరి రియల్ టైం డేటాను చైనా కంపెనీలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. అంతేకాదు, షెంజాన్ సంస్థ, చైనా ప్రభుత్వం, చైనా కమ్యూనిస్ట్ పార్టీ కలిపి ఇన్ఫర్మేషన్ డేటా స్థావరాన్ని నిర్మించి ఈ మిషన్‌ను కొనసాగిస్తున్నట్టు పత్రిక తన కథనంలో వివరించింది.