డ్రగ్స్ కేసులో రియా ఎవరి పేర్లూ చెప్పలేదు!: ఎన్సీబీ వివరణ
- రియా నోటి నుంచి ఎవరి పేర్లూ రాలేదు
- మా వద్ద ఉన్నది డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారి పేర్లే
- ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ కేపీఎస్ మల్హోత్రా
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తరువాత, వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులో రియా ఎవరి పేర్లనూ చెప్పలేదంటూ, తమ వద్ద నిందితులు, బాధితుల జాబితా ఏమీ లేదంటూ ఎన్సీబీ కీలక ప్రకటన చేసింది. దాదాపు 25 మంది పేర్లను ఎన్సీబీ అధికారుల ముందు రియా చెప్పిందని, వారందరికీ వరుసగా నోటీసులను జారీ చేసి, విచారిస్తారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ వార్తలు బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ కలకలం రేపాయి. ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఈ దందాలో ఉందని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ కేపీఎస్ మల్హోత్రా ఓ ప్రకటన విడుదల చేశారు. రియా నోటి నుంచి ఎవరి పేర్లూ రాలేదని స్పష్టం చేశారు. తాము కేవలం డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారి జాబితానే తయారు చేశామని, దాన్నే సినీ పరిశ్రమ జాబితాగా పొరపడ్డారేమోనని అన్నారు. సినీ పరిశ్రమపై జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రమూ నిజం లేదని ఈ ప్రకటనలో కేపీఎస్ మల్హోత్రా పేర్కొనడం గమనార్హం.