పవన్ కల్యాణ్ ఐరన్ లెగ్ వల్ల ఆరోజు నేను ఓడిపోయాను: ఏపీ మంత్రి వెల్లంపల్లి
- ప్రజారాజ్యం ఎమ్మెల్యేగా గతంలో గెలిచిన వెల్లంపల్లి
- అప్పుడు పవన్ ప్రచారానికి రాలేదని వెల్లడి
- 2014లో పవన్ ప్రచారం చేస్తే ఓడిపోయానన్న వెల్లంపల్లి
ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో మీరు పవన్ కల్యాణ్ ఆశీస్సుల కోసం ప్రయత్నించింది నిజం కాదా? అని పవన్ అభిమానులు అంటున్నారు, దీనికి మీరేమంటారు? అని న్యూస్ యాంకర్ ప్రశ్నించగా, తాను ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు దేవుడి దయవల్ల పవన్ కల్యాణ్ ఎప్పుడూ ప్రచారానికి రాలేదని, ఆ ఎన్నికల్లో తాను గెలిచానని వెల్లడించారు.
అయితే, 2014లో తాను బీజేపీ తరఫున బరిలోకి దిగితే, తన తరఫున పవన్ ప్రచారం చేశారని, ఆ ఎన్నికల్లో తాను ఓడిపోయానని తెలిపారు. మళ్లీ 2019లో పవన్ ఆశీస్సులు లేకుండానే గెలిచానని, తాను ఎవరి గురించైనా చెప్పుకోవాల్సి వస్తే అది చిరంజీవి గురించేనని అన్నారు. తనకు రాజకీయ భవిష్యత్తునిచ్చింది చిరంజీవేనని, పవన్ కల్యాణ్ ఆశీస్సుల కోసం తాను ఎప్పుడూ పాకులాడలేదని స్పష్టం చేశారు.
దురదృష్టం కొద్దీ 2014లో నాకు ఓటేయమని పవన్ చెప్పాడని, అప్పుడు ఓడిపోయానని వెల్లడించారు. పవన్ కల్యాణ్ ఐరన్ లెగ్ కారణంగానే ఓడిపోయానని అన్నారు. ఒకవేళ పవన్ అంతపెద్ద లీడర్ అయ్యుంటే రెండు చోట్ల ఎందుకు ఓడిపోతాడని వెల్లంపల్లి ప్రశ్నించారు. పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన వ్యక్తి నన్ను గెలిపిస్తాడంటే ఎవరు నమ్ముతారు? ఇప్పటికైనా పవన్ కల్యాణ్ అభిమానులు ఈ వాస్తవం తెలుసుకోవాలి అని స్పష్టం చేశారు.