యాదాద్రిలో కేసీఆర్ పర్యటన.. నిర్మాణ పనులపై అధికారులకు సూచనలు
- పూర్ణ కుంభంతో కేసీఆర్‌కు స్వాగతం
- బాలాలయంలో కేసీఆర్ పూజలు
- ఆలయ నిర్మాణ పనుల పరిశీలన
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటిస్తున్నారు. కరోనా విజృంభణ నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఆయన పర్యటన కొనసాగుతోంది. ఆలయం వద్దకు చేరుకోగానే పూర్ణ కుంభంతో ఆలయ అర్చకులు, అధికారులు కేసీఆర్‌కు స్వాగతం పలికారు. అనంతరం బాలాలయంలో లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ఆ తర్వాత యాదాద్రిలో కొనసాగుతున్న నిర్మాణ పనులను కేసీఆర్ పరిశీలించారు. ఆలయ నిర్మాణ పనులపై అధికారులకు కేసీఆర్ పలు సూచనలు చేశారు. కేసీఆర్ వెంట రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్ తో పాటు పలువురు ఉన్నారు. కాగా, ఐదేళ్ల క్రితం యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం, విస్తరణ పనులను ప్రారంభించిన విషయం తెలిసిందే.