కరోనా నుంచి కోలుకున్న కొన్ని రోజులకే కేంద్ర మాజీ మంత్రి రఘువంశ్ ప్రసాద్ కన్నుమూత
- ఇటీవలే ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరిన రఘువంశ్
- వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స
- ఇటీవలే ఆర్జేడీకి రాజీనామా చేసిన రఘువంశ్
అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవలే ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరిన కేంద్ర మాజీమంత్రి రఘువంశ్ ప్రసాద్ సింగ్ కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితం ఆయనకు కరోనా సోకగా, చికిత్స తీసుకుని కోలుకున్నారు. అనంతరం మళ్లీ అనారోగ్యానికి గురికావడంతో ఆయన ఆసుపత్రిలో చేరగా, వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు.
ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ప్రాణాలు కోల్పోయారు. కాగా, బీహార్‌లోని లాలూ ప్రసాద్ యాదవ్‌కు చెందిన ఆర్జేడీ పార్టీకి రఘువంశ్ ప్రసాద్ ఇటీవలే రాజీనామా చేశారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు అత్యంత నమ్మకస్తుడిగా రఘువంశ్ ప్రసాద్‌కు పేరు ఉంది. ఏకంగా 32సంవత్సరాల పాటు ఆయన ఆర్జేడీ పార్టీలో కొనసాగారు.
అయితే, తన రాజకీయ ప్రత్యర్థి రామ సింగ్ ఆర్జేడీలో చేరుతున్నారనే ప్రచారం నేపథ్యంలో రఘువంశ్ ప్రసాద్ సింగ్ ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్ష పదవికి గత నెలలోనే రాజీనామా చేసి, ఇటీవలే ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి, పార్టీ నుంచి వైదొలిగారు.