చచ్చిపోతానని పోస్ట్ చేసి కలకలం రేపిన సూర్యాపేట యువకుడు
- చివ్వెంల మండలానికి చెందిన మధుసూదన్‌రెడ్డి
- గతంలో కానిస్టేబుల్‌గా పనిచేసిన మధు
- సైకోగా ప్రవర్తన
- ఇంటి నుంచి పంపేసిన కుటుంబ సభ్యులు
చచ్చిపోతున్నానంటూ ఓ యువకుడు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి కలకలం రేపాడు. అయితే, ఆ విషయాన్ని గుర్తించిన అతడి గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించడంతో అతడు ఎక్కడున్నాడో గుర్తించిన పోలీసులు కాపాడారు. పూర్తి వివరాల్లోకి వెళితే... సూర్యాపేటలోని చివ్వెంల మండలం బండమీదిచందుపట్లకు చెందిన మధుసూదన్‌రెడ్డి అనే వ్యక్తి గతంలో కానిస్టేబుల్‌గా పనిచేశాడు.
అన్నెపర్తి బెటాలియన్‌లో విధులు నిర్వర్తించిన ఆయన సైకోగా వ్యవహరిండంతో కుటుంబ సభ్యులు ఇంట్లోంచి పంపించి మళ్లీ రావద్దని చెప్పారు. దీంతో మధుసూదన్ ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. తనకు ఎవరూ లేరంటూ ఆయన మనస్తాపం చెందాడు. దీంతో ఈ ఒంటరితనాన్ని భరించలేకపోతున్నానని చెబుతూ, ఆత్మహత్య చేసుకుంటానని సామాజిక మాధ్యమంలో పోస్టు చేశాడు.
ఆయన ఉండే గ్రామానికి ఓ కేసు విషయంలో స్థానిక ఎస్సై వెళ్లారు. ఆ సమయంలో గ్రామస్థులు మధుసూదన్ చేసిన పోస్టును ఆయనకు సూచించారు. సెల్‌ఫోన్ నెట్‌వర్క్ ఆధారంగా మధుసూదన్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో పోలీసులు గుర్తించారు. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో మధుసూదన్ ఉన్నట్లు తేలడంతో అక్కడికి వెళ్లిన పోలీసులు అతడిని రక్షించారు.