కంగనా రనౌత్ కు అపాయింట్మెంట్ ఇచ్చిన మహారాష్ట్ర గవర్నర్!
- మహారాష్ట్ర ప్రభుత్వంతో వివాదానికి దిగిన కంగన
- నేటి సాయంత్రం గవర్నర్ తో భేటీ
- ఉద్ధవ్ సర్కారుపై ఫిర్యాదు చేయనున్న హీరోయిన్
శివసేన, కాంగ్రెస్ నేతృత్వంలోని పాలనలో ముంబై నగరం పాక్ ఆక్రమిత కాశ్మీర్ లా మారిందని సంచలన వ్యాఖ్యలు చేసిన తరువాత, బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ఎంతగా విమర్శలు, వ్యతిరేకతను ఎదుర్కుందో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో సైతం కంగనకు అనుకూలంగా, వ్యతిరేకంగా మారిపోయి కామెంట్లు పెడుతున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం, పోలీసులపై ఆమె తీవ్ర విమర్శలు చేసిన గంటల వ్యవధిలో, నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు సాగించిందంటూ, ఆమె ఆఫీసును బీఎంసీ అధికారులు పాక్షికంగా కూలగొట్టారు కూడా. అయినా ఏ మాత్రమూ తొణకని కంగన, తన విమర్శల ధాటిని పెంచింది.
ఈ నేపథ్యంలో బీజేపీ కంగనకు అండగా నిలిచిందన్న సంగతి తెలిసిందే. ముంబైలో కంగన అడుగు పెట్టేందుకు భారీ భద్రతను కూడా కల్పించింది. తాజాగా, ఇప్పుడు మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ కూడా ఆమెకు అపాయింట్మెంట్ ఇచ్చారు.నేటి సాయంత్రం కంగన స్వయంగా వెళ్లి గవర్నర్ తో భేటీ కానుంది. తనకు జరిగిన అన్యాయం, ఉద్ధవ్ థాకరే ప్రభుత్వ వైఖరి గురించి ఆమె గవర్నర్ కు ఫిర్యాదు చేయనుందని సమాచారం.