మరోసారి ఎయిమ్స్ లో చేరిన అమిత్ షా!
- గత రాత్రి అలసట, ఆయాసం
- ఆసుపత్రికి తరలించిన కుటుంబీకులు
- పక్షం రోజుల క్రితమే డిశ్చార్జ్
కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా, మరోమారు అనారోగ్యం బారిన పడటంతో, గత రాత్రి ఆయన్ను న్యూఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. దాదాపు నెల రోజుల క్రితం కరోనా సోకిన తరువాత, ఆసుపత్రిలో చేరిన ఆయన, చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన తరువాత, పోస్ట్ కొవిడ్ కేర్ కోసం తిరిగి ఆసుపత్రిలో చేరారన్న సంగతి తెలిసిందే. ఆపై రెండు వారాల క్రితం ఆయన డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 55 ఏళ్ల వయసులో ఉన్న అమిత షా, గత రాత్రి తన ఒంట్లో నలతగా ఉందని చెప్పడంతో కుటుంబసభ్యులు ఎయిమ్స్ కు తరలించారు.
ఆగస్టు 14న గురుగ్రామ్ లోని మేదాంతా నుంచి ఢిశ్చార్జ్ అయిన అమిత్ షా, వైద్యుల సలహా మేరకు తాను మరికొన్ని రోజులు హోమ్ ఐసోలేషన్ లో ఉంటానని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. గత రాత్రి తనకు ఆయాసం వస్తోందని, అలసటగానూ, ఒళ్లు నొప్పులుగానూ ఉన్నాయని చెప్పడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.