కరోనా కన్నా దోమే గొప్పదంటూ... ఎలాగో చెబుతున్న పూరీ జగన్నాథ్!
- 'పూరీ మ్యూజింగ్స్' లో కొత్త వాయిస్ మెసేజ్
- ఏటా దోమల వల్ల 8 లక్షల మంది చనిపోతారు
- కరోనాతో పోలిస్తే దోమలే చాలా డేంజరన్న పూరీ
డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ 'పూరీ మ్యూజింగ్స్' అంటూ తన వాయిస్ ఓవర్‌తో కొన్ని ఆడియోలను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఏదో ఒక టాపిక్ తీసుకుని దానిపై తనకున్న అభిప్రాయం ఏమిటో చాలా విపులంగా పూరి తెలియజేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో టాపిక్‌ల మీద వాయిస్ మ్యూజింగ్స్ విడుదల చేసిన పూరి.. తాజాగా 'దోమలు' అనే టాపిక్ మీద ఆయన వివరణ ఇచ్చారు. కరోనా కంటే కూడా దోమలే డేంజర్ అని చెబుతూ దోమల వల్ల బెనిఫిట్ కూడా ఉందని పూరి తెలిపారు. ఆ వివరాలేంటో చూద్దాం.
"మనం ఎప్పుడూ డెడ్‌లీ యానిమల్స్ గురించి వర్రీ అవుతుంటాం. పులులు, సింహాలు లాంటివి మనల్ని చంపేస్తాయేమోనని. ఏడాదిలో టైగర్ అటాక్స్ ఒకటో, రెండో వింటాం. షార్క్‌ల వల్ల మనుషులు ఇయర్లీ ఓ 10 మంది చస్తారు. పాముల వల్ల ప్రతి యేటా ఓ 50 వేల మంది పోతారేమో?. కానీ దోమల వల్ల ప్రతి సంవత్సరం 8 లక్షలమందికి పైగా చనిపోతున్నారు. మస్కిటోస్ అన్నీ కెరియర్స్‌గా పనిచేస్తాయ్. కొరియర్ సర్వీస్. కామ్ గా డెలివరీ ఇచ్చి వెళ్లిపోతాయి. చికిన్ గునియా, డెంగ్యూ, మలేరియా, ఎల్లో ఫీవర్, జికా వైరస్.. ఇలా ఎన్నో డెలివరీలు. దోమల్లో 2500 రకాలు ఉన్నాయి. మనల్ని కుట్టేవన్నీ ఆడదోమలే.
పాపం మగదోమలు మంచివి.. కుట్టవు. ఈ ఆడదోమలు ఎందుకు కుడతాయంటే.. వాటికి ఎగ్స్ ప్రొడ్యూస్ చేయడానికి బ్లడ్ కావాలి. మనమీద వాలిన వెంటనే.. మనకి... ముందు వాటి సలైవాన్ని మెల్లగా రాస్తాయి. ఇట్స్ ల్యూబ్రికేట్స్ ద ఓపెనింగ్. అప్పుడు సైలెంట్‌గా ఇంజక్షన్ చేస్తాయ్. మన బ్లడ్ తీసుకుని ఎగ్స్ పెడుతుంటాయ్. ఒక దోమ ఒక ట్రిప్పుకి వంద గుడ్లు పెడతాయి. ఇలా 5 ట్రిప్పులు. 5 కాన్పులు. 500 పిల్లలు.
వీటి లైఫ్ స్పాన్ మహా అయితే వారం నుంచి నాలుగు వారాలు బతుకుతాయి. ఈ నాలుగు వారాల్లోనే మనకి అంటించాల్సిన జబ్బులన్నీ అంటించేసి.. ఒక్కో దోమ 500 పిల్లల్ని కని, మనకి గిఫ్ట్‌గా ఇచ్చి స్వర్గానికి వెళ్లిపోతాయ్. మనమేమో చాలా కష్టపడి ఒక కొడుకుని కంటాం. వాడికి కంపెనీ ఇవ్వడానికి ఇవి వేల వేల పిల్లల్ని కంటూ ఉంటాయి. అవన్నీ కలిసి మన పిల్లలతో ఆడుకుంటూ ఉంటాయ్. ఉన్న ఒక్క కొడుకు ఏ డెంగ్యూతోనూ పోకుండా మనం చూసుకోవాలి. ఇలాంటి డేంజర్ కండీషన్ లో ఉన్నాం మనం.
అయితే ఇందులో ఒక ఫెసిలిటీ ఉంది. మన స్వెట్ కానీ వాటికి నచ్చకపోతే.. అవి మనల్ని కుట్టవ్. ఈ ఓడోమాస్, యూకలిప్టస్ ఆయిల్ వెనుకున్న రహస్యం అదే. కొన్ని మస్కిటోస్ లేని కంట్రీస్ ఉన్నాయ్. అంటార్కిటికా, ఐస్‌లాండ్.. ఇవి కాకుండా శ్రీలంక, మాల్దీవుస్ లో దోమల్ని కంప్లీట్ గా ఎరాడికేట్ చేసేశారు. గత 40 ఏళ్లుగా అక్కడ దోమల్లేవ్. మలేరియా ఫ్రీ కంట్రీస్ ఇవి. ఈ మధ్య ఫ్లోరిడాలో జెనిటికల్లీ మోడిఫైడ్ మస్కిటోస్ తయారు చేశారు. 750 మిలియన్ మస్కిటోస్ ని బయటికి వదిలారు. అవి ఏం చేస్తాయంటే.. ఫీమేల్ మస్కిటోస్ కానీ పుడితే..అవి గుడ్లు పెట్టే ముందు ప్యూపా దశలోనే చనిపోయేలా ప్లాన్ చేస్తాయ్.మస్కిటోస్‌లో అండర్ కవర్ మస్కిటోస్ అవి. ఈ మధ్యనే వదిలారు. ఇంకా రిజల్ట్ రాలేదు.. చూడాలి.
అయితే ఇప్పుడు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా.. మొత్తం అందరం శానిటైజర్స్ రాసుకుంటూ, భయంతో ఇన్నాళ్లూ ఇళ్లలో దాక్కుంటే.. ఇప్పటి వరకు కరోనా వల్ల చనిపోయిన వారు 8 లక్షల చిల్లర మంది. మస్కిటోస్ వల్ల ప్రతి ఏడాది 8 లక్షలు చావులు. సో.. ఎవర్ పవర్ ఫుల్. దోమా.. కరోనానా? ఎలాంటి పబ్లిసిటీ లేకుండా, బిల్డప్పులు లేకుండా, కామ్ గా మనషులను ఒక్కొక్కడినిగా వేసుకుంటూ పోతున్నాయ్. లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ మర్డర్స్ చేస్తున్నాయ్. ఇస్మార్ట్ మస్కిటోస్. అయితే కరోనా కంటే ఈ దోమల వల్ల బెనిఫిట్ ఏమిటంటే.. లాక్‌డౌన్ అవసరం లేదు. ఎవరిపని వారు చేసుకోవచ్చు. జీడీపీ పడిపోదు. ఐ థింక్ మస్కిటోస్ బెటరనుకుంటా.." అని పూరిజగన్నాథ్ తన ఆడియోలో తెలిపారు.