తనకు రాఖీ పంపిన ఉత్తరాఖండ్ మహిళకు ధన్యవాదాలు తెలిపిన మోదీ
- జులై 28న స్పీడ్ పోస్టు ద్వారా మోదీ, త్రివేంద్రసింగ్ రావత్‌లకు రాఖీలు పంపిన మహిళ
- ఆనందం వ్యక్తం చేస్తూ దీపకు లేఖ రాసిన మోదీ
- రక్షాబంధన్ మన మధ్య ఆప్యాయతలను పెంచుతుందని లేఖ
రక్షాబంధన్ సందర్భంగా తనకు రాఖీ పంపిన ఉత్తరాఖండ్‌లోని రుద్రపూర్‌కు చెందిన దీపా మటేలాకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ధన్యవాదాలు తెలిపారు. రాఖీ పండుగను పురస్కరించుకుని జులై 28న ప్రధాని నరేంద్రమోదీ, ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్రసింగ్ రావత్‌లకు దీప స్పీడ్ పోస్టు ద్వారా రాఖీలు పంపించారు. వాటిని అందుకున్న మోదీ దీపకు ధన్యవాదాలు తెలుపుతూ లేఖ రాశారు.
అన్నాచెల్లెళ్లు ఒకరికొకరు రక్షణగా ఉండాలని తెలిపే భారతీయ సంస్కృతి ఎంతో గొప్పదని మోదీ ఆ లేఖలో పేర్కొన్నారు. రక్షాబంధన్ పండుగ మన మధ్య ఆప్యాయతను పెంచుతుందని అన్నారు. ఇతరుల పట్ల సానుభూతితో వ్యవహరించాలన్న విషయాన్ని కరోనా మనకు నేర్పుతోందని ప్రధాని ఆ లేఖలో పేర్కొన్నారు.