సుషాంత్ పార్టీల్లో కొకైన్, ఎల్ఎస్డీ: ఎన్సీబీ విచారణలో రియా చెప్పినట్టు రిపోర్ట్!
- మాదక ద్రవ్యాలు తప్పనిసరిగా ఉండేవి
- ఇద్దరు బాలీవుడ్ నటులు కూడా ఉండేవారు
- 20 పేజీల రిపోర్టును తయారు చేసిన ఎన్సీబీ
ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఇచ్చే పార్టీల్లో మాదక ద్రవ్యాలు తప్పనిసరిగా ఉండేవని మహారాష్ట్ర ఎన్సీబీ (నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో) అధికారుల విచారణలో అతని ప్రియురాలు రియా స్వయంగా వెల్లడించినట్టు సమాచారం. ఈ మేరకు ఎన్సీబీ అధికారులు రిపోర్టును కూడా తయారు చేశారని తెలుస్తోంది. సుశాంత్ పార్టీల్లో కొకైన్, ఎల్ఎస్డీ, గంజాయి తదితరాలను వాడుతారని, బాలీవుడ్ కు చెందిన ఇద్దరు ప్రముఖ నటులు అన్ని పార్టీలకూ హాజరయ్యేవారని ఆమె వెల్లడించినట్టు తెలుస్తోంది.
ఈ కేసులో రియా, ఆమె సోదరుడు షోవిక్ లతో పాటు మిరాండాలకు మత్తు మందులను సరఫరా చేసిన రంజీత్ అనే వ్యక్తిని సహా ముంబైలో ఇంతవరకూ ఏడుగురిని ఎన్సీబీ అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. తమ విచారణలో భాగంగా రియాను విచారించిన అధికారులు, దాదాపు 20 పేజీల రిపోర్టును తయారు చేసింది. తనతో డేటింగ్ లో ఉన్న సమయంలో సుశాంత్ ఎన్నో విషయాలను పంచుకున్నాడని చెప్పిన రియా, అతను ఇచ్చే పార్టీలకు హాజరయ్యే వారి పేర్లను కూడా పేర్కొంది. ఈ పార్టీలన్నీ సుశాంత్ ఫామ్ హౌజ్ లో జరుగుతాయని కూడా ఆమె చెప్పినట్టు తెలుస్తోంది.