జడ్జి ఫోన్ నుంచి ప్రేమసందేశం... అగ్గిమీద గుగ్గిలమైన మహిళా ఎస్పై

  • గుజరాత్ ఆమ్రేలి జిల్లాలో ఘటన
  • జడ్జిని ప్రశ్నించిన లేడీ ఎస్సై
  • తన ఇంటి పనిమనిషి సందేశాలు పంపి ఉండొచ్చన్న జడ్జి
గుజరాత్ లోని అమ్రేలి జిల్లాలో ఆసక్తికర సంఘటన జరిగింది. రజూలా పట్టణంలో అడిషనల్ జడ్జి తనకు ప్రేమసందేశం పంపారంటూ ఓ మహిళా ఎస్సై ఆరోపించడం తీవ్ర కలకలం రేపింది. ఆగస్టు 30 తెల్లవారుజామున సదరు జడ్జి ఫోన్ నుంచి గుడ్ మార్నింగ్ అంటూ మొదలై మిస్ యూ డియర్, లవ్యూ టూ అంటూ సందేశాలు పోటెత్తాయి. ఈ మెసేజ్ లు చూసిన మహిళా ఎస్సై దిగ్భ్రాంతికి గురైంది.

ఆ ఫోన్ నెంబర్ ఎవరిదో తెలియకపోవడంతో వెంటనే ఆ నెంబర్ కు కాల్ చేసింది. ఎవరు మీరు అని ప్రశ్నించగా, సెషన్స్ కోర్టు అడిషనల్ జడ్జిని అని సమాధానం వచ్చింది. ఈ మెసేజ్ లు ఎందుకు పంపారని నిలదీయగా, తాను ఆ సందేశాలు పంపలేదని, తన ఇంట్లో పనిమనిషి పంపి ఉండొచ్చని తెలిపాడు.

అయితే ఈ వాదన మహిళా ఎస్సైకి నమ్మశక్యంగా అనిపించలేదు. మీ ఫోన్ నుంచి మీ పనిమనిషి సందేశాలు పంపడం ఎలా సాధ్యమని అడిగితే అవతలి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఆ మహిళా ఎస్సై జిల్లా ఎస్పీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది.


More Telugu News