ముంబయి పోలీస్ కమిషనర్ నాపై దారుణాలకు పాల్పడ్డాడు: బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ తీవ్ర ఆరోపణలు
- కంగనా రనౌత్ కు మద్దతు పలికిన ప్రగ్యా
- సీపీ పరంబీర్ ఎలాంటివాడో తనకు తెలుసన్న బీజేపీ ఎంపీ
- అతడిపై ఉన్న ఆరోపణలు అవాస్తవం కాదని వెల్లడి
వివాదాస్పద బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కు మద్దతు పలికారు. ఈ క్రమంలో ప్రగ్యా ఠాకూర్ ముంబయి పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. గతంలో తాను పోలీస్ కస్టడీలో ఉన్న సమయంలో పరంబీర్ సింగ్ తనపై దారుణాలకు పాల్పడ్డాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముంబయిలో కంగనా కార్యాలయం కూల్చివేత కాంగ్రెస్ ప్రోద్బలిత రాజకీయ ప్రతీకార కార్యక్రమంలో భాగంగా జరిగిందని పేర్కొన్నారు.
కంగనాపై కేసు నమోదు చేయడంలో ముంబయి పోలీస్ కమిషనర్ పాత్రను ప్రశ్నిస్తూ.... "పరంబీర్ సింగ్ ఎలాంటివాడో నాకు తెలుసు. అప్పట్లో అతను సీనియర్ పోలీసు అధికారి. ఇప్పుడు ముంబయి పోలీస్ కమిషనర్ అయ్యాడు. నాపై దారుణాలకు తెగబడ్డాడు. అతడిపై ఉన్న ఆరోపణలు అబద్ధం కావని మాత్రం చెప్పగలను" అంటూ పేర్కొన్నారు.
మహారాష్ట్ర ప్రభుత్వం కంగనాపై తీసుకుంటున్న చర్యలు కాంగ్రెస్ పార్టీ తరఫునే అని ప్రగ్యా ఆరోపించారు. మహా సర్కారులో హోంమంత్రిత్వ శాఖ కాంగ్రెస్ వద్దే ఉంది కాబట్టి, అందుకే మహిళలను అవమానిస్తోందని విమర్శించారు.