సహజవాయువుపై భారీగా వ్యాట్ పెంచిన ఏపీ ప్రభుత్వం
- 14.5 శాతం నుంచి 24.5 శాతానికి వ్యాట్ పెంపు
- కరోనా వల్ల ఆదాయం తగ్గిందన్న ప్రభుత్వం
- వివిధ పథకాల అమలు కోసం వ్యాట్ పెంచినట్టు ప్రకటన
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సహజవాయువుపై విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం 14.5 శాతంగా ఉన్న పన్నును ఏకంగా 24.5 శాతానికి పెంచుతూ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిపోయిన నేపథ్యంలో సహజవాయువుపై వ్యాట్ ను 10 శాతం పెంచింది.
2020 ఏప్రిల్ నెలకు రూ. 4,480 కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా కేవలం రూ. 1,323 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చిందని ఈ సందర్భంగా ప్రభుత్వం తెలిపింది. పలు ప్రభుత్వాలకు నిధులు పెద్ద మొత్తంలో అవసరమైన నేపథ్యంలో వ్యాట్ పెంచాల్సి వచ్చిందని ప్రకటించింది. ఇప్పటికే పెట్రోల్ పై 31 శాతంతో పాటు అదనంగా మరో నాలుగు రూపాయల మేర, డీజిల్ పై 22.5 శాతంతో పాటు అదనంగా నాలుగు రూపాయల మేర, ఎర్ టర్బైన్ ఇంధనంపై ఒక శాతం వరకు, ముడి చమురుపై 5 శాతం వరకు వ్యాట్ వసూలు చేస్తోంది.