అర్జున్ కు కరోనా రావడంతో మా షూటింగ్ రద్దయింది: రకుల్ ప్రీత్ సింగ్
- బాలీవుడ్ లో అర్జున్ కపూర్ సరసన నటిస్తున్న రకుల్
- ముంబైకి వెళ్తుండగా అర్జున్ కు కరోనా వచ్చినట్టు ఫోన్
- షూటింగ్ స్పాట్ కు వెళ్లలేదన్న రకుల్
బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. కరోనా రిపోర్ట్ రావడానికి రెండు రోజుల ముందు అర్జున్ సినిమా షూటింగులో పాల్గొన్నాడు. ఆ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. షూటింగ్ కోసం హైదరాబాద్ నుంచి ముంబైకి రకుల్ బయల్దేరింది. అయితే ఎయిర్ పోర్టులో విమానం టేకాఫ్ అవ్వడానికి ముందు తనకు ఫోన్ వచ్చిందని... అర్జున్ కు పాజిటివ్ రావడంతో షూటింగ్ రద్దు చేసినట్టు చెప్పారని ఈ సందర్బంగా రకుల్ తెలిపింది. దాంతో, తాను షూటింగ్ స్పాట్ కు వెళ్లలేదని చెప్పింది. ప్రస్తుతం అర్జున్ ఆరోగ్యంగానే ఉన్నాడని తెలిపింది. ముంబైకి వెళ్లే ముందు తాను కరోనా పరీక్షలు చేయించుకున్నానని... పరీక్షల్లో తనకు నెగెటివ్ వచ్చిందని చెప్పింది.