హాస్యనటుడు వడివేలు బాలాజీ పిల్లల్ని చదివిస్తా: సినీ నటుడు శివకార్తికేయన్
- అనారోగ్యంతో గురువారం కన్నుమూసిన వడివేలు బాలాజీ
- ఆయన ఇద్దరు పిల్లల్ని చదివిస్తానన్న నటుడు శివకార్తికేయన్
- బాలాజీ మృతికి కోలీవుడ్ సంతాపం
అనారోగ్యంతో కన్నుమూసిన తమిళ హాస్యనటుడు వడివేలు బాలాజీ ఇద్దరు పిల్లల్ని చదివించేందుకు నటుడు శివకార్తికేయన్ ముందుకొచ్చారు. బాలాజీ పిల్లల చదువులకు అయ్యే ఖర్చులు తాను భరిస్తానని హామీ ఇచ్చారు. శివకార్తికేయన్ మంచి మనసుకు ప్రశంసలు కురుస్తున్నాయి. కాగా, బాలాజీ మృతికి కోలీవుడ్ సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయ్ సేతుపతి, రోబో శంకర్, దివ్యదర్శిని తదితరులు బాలాజీ భౌతిక కాయానికి నివాళులర్పించారు. బాలాజీ కుటుంబానికి విజయ్ సేతుపతి కూడా కొంత ఆర్థిక సాయం చేసినట్టు చెబుతున్నారు.
అనారోగ్యంతో ప్రాణాలు విడిచిన వడివేలు బాలాజీ పలు సినిమాల్లో నటించారు. మిమిక్రీ ఆర్టిస్టుగా కెరియర్‌ను ప్రారంభించిన బాలాజీ టీవీలోనూ పలు కార్యక్రమాలు చేశారు. 15 రోజుల క్రితం గుండెపోటు రావడంతో పక్షవాతానికి గురయ్యారు. తొలుత చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చినప్పటికీ ఖర్చులు భరించలేక తర్వాత పలు ఆసుపత్రులకు తిప్పారు. చివరికి ఒమండురార్ ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం బాలాజీ కన్నుమూశారు.