దుబ్బాకలో కాంగ్రెస్ కొట్టే దెబ్బకు కేసీఆర్ దిమ్మ తిరగాలి: టీపీసీసీ చీఫ్ ఉత్తమ్
- దుబ్బాక నియోజకవర్గ గ్రామస్థాయి నేతలతో గాంధీభవన్‌లో సమావేశం
- తెలివిగా వ్యవహరించి టీఆర్ఎస్‌ను దెబ్బకొట్టాలని పిలుపు
- ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకుందాం
త్వరలో జరగనున్న దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కొట్టే దెబ్బకు కేసీఆర్ దిమ్మ తిరగాలని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నిన్న దుబ్బాక నియోజకవర్గానికి చెందిన గ్రామస్థాయి నేతలతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. మూడు రోజుల్లోగా దుబ్బాక నియోజకవర్గంలోని అన్ని మండలాల కమిటీలు పూర్తి చేయాలని కోరారు. అలాగే, మరో వారంలో అన్ని గ్రామాల్లో పార్టీ, అనుబంధ సంఘాల కమిటీలు పూర్తి చేసి ఎప్పుడు ఎన్నికలు జరిగినా సిద్ధంగా ఉండాలన్నారు.
గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు నేతలు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, దానిని అనుకూలంగా మార్చుకుందామని అన్నారు. ఈ ఎన్నికల్లో తెలివిగా వ్యవహరించి టీఆర్‌ఎస్‌ను వ్యూహాత్మకంగా దెబ్బకొడదామన్నారు.